ప్రభాస్ ఆ స్టార్ హీరోయిన్ తో అందుకే సినిమా చేయడం లేదా..!

చిత్ర పరిశ్రమలో మంచి క్రీజ్ ఉన్న హీరో- హీరోయిన్లు కాంబినేషన్లో సినిమాల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అయితే వారి రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. ఇక ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంటే చాలు ఎన్నో వార్తలు వస్తాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఆ జోడి ఏంటనేది చూస్తే.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు స్టార్ హీరోయిన్ సమంత. వీరిద్దరికీ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు వరకు వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు. ప్రభాస్ ఎక్కువగా అనుష్క, పూజా హెగ్డే, నయనతార, శ్రేయ వంటి హీరోయిన్స్ తోనే సినిమాలు చేశాడు. మరి సమంతతో ఎందుకు సినిమా చేయలేదు అంటే వీరిద్దరి మధ్య హైట్ ప్రాబ్లం ఉందట. సమంత, ప్రభాస్ పక్కన సెట్ కాదని దర్శకులు ఒప్పుకోలేదని తెలుస్తుంది.

Prabhas reveals the reason why he has not acted with Samantha | Tamil Movie  News - Times of India

కొరటాల శివ మొదటి సినిమా మిర్చిలో సెకండ్ హీరోయిన్‌గా సమంతను తీసుకుందామని చూస్తే ప్రభాస్ నో చెప్పాడని అందుకే రిచాను తీసుకున్నారని ఓ టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఏదీ ఎలా ఉన్నా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్- సమంత కూడా వరుస‌ సినిమాలతో ఫుల్ బిజీగా తమ కెరియర్ లో దూసుకుపోతున్నారు. ఇక మరి భవిష్యత్తులైన ఈ కాంబినేషన్ ను ఎవరు సెట్ చేస్తారనేది చూడాలి.