పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్‌… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్‌ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్‌. ముందు నుంచి ఈ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో అదరగొట్టగా.. ఆ ఎపిసోడ్ విడుదలైన సమయంలో ఆహా సర్వర్ కూడా షేక్ అయ్యేలా ప్రభాస్ అభిమానులు ఒకేసారి ఎటాక్ చేశారు.

Prabhas With NBK | Prabhas Unstoppable 2 Episode - YouTube

 

ప్రభాస్ తో బాలయ్య మొదటి ఎపిసోడ్ ఎవరు ఊహించని రీతిలో గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా సెకండ్ పార్ట్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. అయితే ఎందుకు ఏమో కానీ మొదటి పార్ట్‌కి వచ్చినంత బజ్ రెండో పార్ట్ కి రాలేదు. దీంతో ఆహా టీమ్‌ చేసిన ఈ అతి తెలివి పనికి ప్రేక్షకులు కూడా గట్టి షాక్ ఇచ్చారు. ప్రభాస్ మొదటి ఎపిసోడ్ లో కూడా బాలయ్య పెళ్లి గురించి అడుగుతూ కాస్త ఇరకాటంలో పెడుతూ విసిగించాడు.

unstoppable prabhas episode - unstoppable prabhas promo

ఇప్పుడు రెండో భాగం లో కూడా ప్రభాస్ రాణి ఎవరు ? అంటూ మరో గెస్ట్ గా వచ్చిన గోపీచంద్ తో కూడా చెప్పించాలని ప్రయత్నించాడు. ఈ రెండు ఎపిసోడ్‌లు మొత్తం ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ల గురించి ఆరా తీయడమే సరిపోయింది. టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి.

Unstoppable with NBK Season 2: Nandamuri Balakrishna asks Prabhas about  marriage, link-ups | Entertainment News,The Indian Express

మెయిన్ మీడియాలో కూడా ఎన్నో రకాలు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అంత సాగ తీయడం అభిమానులకు నచ్చలేదు. రెండో భాగం లో గోపీచంద్ వచ్చిన అంత కిక్ ఇవ్వలేదు. అయితే వారి సినిమాలు గురించి బాలయ్య రివ్యూ ఇచ్చాడు వారి కెరీర్ గురించి కూడా బాలకృష్ణ ప్రస్తావించాడు. ఇదంతా చాలా తక్కువ టైమ్‌ నడవగా షో మొత్తం కేవలం ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఈ ఎపిసోడ్ మీద అంత ఆసక్తి లేకుండా పోయింది.

Unstoppable With Prabhas Part2 TRP

అందుకే మొదటి ఎపిసోడ్ ఆహా షేక్ అయ్యే రేంజ్ లో ప్రేక్షకులు చూడగా.. రెండు ఎపిసోడ్ ని మాత్రం అంతంత మాత్రం గానే చూస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆహా టీమ్‌ చేసిన ఈ రెండు ఎపిసోడ్‌ల‌ ప్లాన్ .బెడిసి కొట్టినట్టు అయింది.

Share post:

Latest