సమంత గురించి నాకు తెలియ‌దు, దీపికానే కాపాడ‌తా.. ప్ర‌భాస్ ఆన్స‌ర్‌కు బాల‌య్య షాక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో పాటు ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫ‌స్ట్ పార్ట్ న్యూ ఇయ‌ర్ కు ముందుకు బ‌య‌ట‌కు వ‌చ్చి విశేష ఆధ‌ర‌ణ‌ను పొందింది.

తాజాగా సెకండ్ పార్ట్ కూడా బ‌య‌టకు వ‌చ్చింది. ప్ర‌భాస్‌, గోపీచంద్ ల‌తో క‌లిసి బాల‌య్య ఆద్యంతం నవ్వించారు. ప్రేక్ష‌కుల‌ను అద్భుతంగా అలరించారు. హీరోలిద్ద‌రి నుంచి బాల‌య్య బోలెడ‌న్ని సీక్రెట్స్ ను బ‌య‌ట‌కు లాగాడు. ఈ క్ర‌మంలోనే కొంతమంది హీరోయిన్స్ ని చూపిస్తూ ప్రభాస్ ని బాల‌య్య పలు ప్రశ్నలు వేశారు. నయనతార, తమన్నాని చూపిస్తూ ఎవర్ని షాపింగ్ కి తీసుకెళ్తావ్ అంటే ఇద్దర్ని అని చెప్పాడు.

అలాగే పూజా హెగ్దే, శ్రద్ధా కపూర్ పిక్స్ ను చూపించి ఇద్దరిలో ఎవరితో కలిసి సినిమాకి వెళ్తావు అని అడిగితే.. ప్ర‌భాస్ ఇద్ద‌రూ వ‌ద్దు అనేశాడు. సమంత, దీపికా పదుకొనె ఫోటోలని చూపించి వీళ్ళిద్దరూ సముద్రంలో పడిపోతే ఎవర్ని కాపాడతావు అని ప్ర‌శ్నించాడు బాల‌య్య‌. అందుకు ప్ర‌భాస్ `సమంత గురించి నాకు తెలియ‌దు కానీ, దీపికానే కాపాడ‌తా` అని తెలిపాడు. ప్ర‌భాస్ ఆన్య‌ర్‌కు బాల‌య్య షాక్ అయ్యి అదేంట‌య్యా అని ఎదురు ప్ర‌శ్నించ‌గా.. `ప్రస్తుతం ప్రాజెక్ట్ కె సినిమా నడుస్తుంది, అందులో దీపికానే హీరోయిన్, సినిమా ఆగిపోకూడదు కదా` అని తెలివిగా ప్ర‌భాస్ స‌మాధానం ఇచ్చాడు.