ప్రభాస్‌కి కోపం వ‌స్తే అందర్నీ వెళ్ళిపోమ‌ని అలా చేస్తాడు.. గోపీచంద్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ప్ర‌భాస్‌, గోపీచంద్ ఖ‌చ్చితంగా ఉంటారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇటీవ‌ల ఆహా వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో కూడా పాల్గొన్నాడు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ తొలి భాగం న్యూ ఇయ‌ర్ కు ముందే బ‌య‌ట‌కు రాగా.. సెకండ్ పార్ట్ ను తాజాగా ఆహా టీమ్ బ‌య‌ట‌కు వ‌దిలింది.

రెండో భాగం కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఎంట‌ర్టైన్ చేస్తోంది. ప్ర‌భాస్‌, గోపీచంద్ ల‌తో బాల‌య్య ఓ ఆట ఆడుకున్నారు. వారి ద‌గ్గ‌ర నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను రాబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే బాగా కోపం వ‌స్తే మీరిద్ద‌రు ఏం చేస్తారు..? అని బాల‌య్య ప్ర‌శ్నించాడు. అందుకు ప్ర‌భాస్ మాట్లాడుతూ.. `గోపీచంద్ కి అసలు కోపం, చిరాకు రాదు. ఓపిక చాలా ఎక్కువ.

ఒకసారి షూటింగ్ లో ముక్కుకి గాయం అయి బ్లడ్ వస్తుంది, అలాంటి సమయంలో కూడా నేను నవ్వుతూ వాడ్ని కొట్టినా కూల్ గా మాట్లాడాడు.` అంటూ చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ ప్ర‌భాస్ గురించి చెబుతూ.. `ప్రభాస్ కి కోపం వస్తే అందర్నీ గెట్ అవుట్ అని వెళ్ళిపోమంటాడు, ఆ తర్వాత ఒక్కడే కూర్చొని సిగరెట్ తాగుతాడు` అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సిగరెట్ తాగుతాడు అనేది డైరెక్ట్ గా చెప్పకుండా సైగల్ చేశాడు. దీంతో గోపీచంద్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest