తన అందంతో మాయ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి అగ్ర కథానాయకగా కొనసాగింది. హీరోయిన్ ఆసిన్. అందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సూర్యతో గజిని సినిమాలో నటించి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కూడా కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్నా స్టార్ హీరోలు సరసన పలు సినిమాలలో నటించింది.

In pics: Here's how Ghajini actress Asin looks now

ఈమె టాలీవుడ్ లో శివమణి, లక్ష్మీ న‌ర‌సింహ‌, చక్రం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అన్నవరం సినిమాలో నటించింది. వీటితోపాటు బాలీవుడ్ లో కూడా వరుస‌ సినిమాల్లో నటించి అక్కడ కూడా స్టార్‌ హీరయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె బాలీవుడ్ లో ముందుగా గజినీ రీమేక్ లో అమీర్ ఖాన్ కు జంటగా నటించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర హీరోల సరసన కూడా నటించింది.

93 சதவீதம் சரிவு! நடிகை அசினின் கணவர் எடுத்த அதிரடி முடிவு!

తన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలు కు దూరమైంది. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ కు జంటగాా ఆల్ ఈజ్ వెల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మైక్రో మ్యాక్స్ అధినేత రాహుల్ శర్మతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. వీరిద్దరి వివాహం 2016లో న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఆరిన్ అనే పాప కూడా ఉంది. ప్రస్తుతం ఆసిన్ సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్త వ్యాపారాలు చూసుకుంటూ తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసిన్‌ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Asin Thottumkal (@simply.asin)