ఓ మై గాడ్: సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కొసం .. కాజల్ అలాంటి సాహసం చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే జనాలకు కొంతమంది హీరోయిన్స్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . మన మధ్య లేకపోయినా సౌందర్యకు ఎలాంటి ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ ఆమె పేరుని సోషల్ మీడియాలో పుట్టినరోజుకి ఏ విధంగా టృఎండ్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే . అంతలా చెరగని ముద్రను తన పేరుపై వేసుకున్న సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలోచనలు ఆమె జ్ఞాపకాలు మన మధ్యనే తిరుగుతూ ఉన్నాయి . అలా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే తమకు నచ్చిన హీరోయిన్స్ ని దైవంలా భావిస్తూ ఉంటారు కొంతమంది జనాలు .

కాగా సౌందర్య తర్వాత అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని సంపాదించుకునింది అందాల ముద్దుగుమ్మ కాజల అగర్వాల్ . లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా ఈ ముద్దుగుమ్మ తర్వాత తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను వేసుకుంది . మరీ ముఖ్యంగా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలేసిన కాజల్ అగర్వాల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే తాను ప్రేమించిన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్చులు ని పెళ్లి చేసుకుంది .

అంతేకాదు ఎడాది తిరగక ముందు ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పి పండు లాంటి బాబుకు జన్మనిచ్చింది . ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ పై కాన్సన్ట్రేషన్ చేసిన కాజల్ అగర్వాల్ ..సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాగైనా సరే తన సత్తాను చాటడానికి మంచి కంటెంట్ ఉన్న రోల్స్ను చూస్ చేసుకుంటుందట . అంతేకాదు ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తుందట. రెమ్యూనరేషన్ ఇచ్చిన సరే కంటెంట్ లేకుండా తన పాత్రకు ప్రాధాన్యం లేకుండా .. సినిమా చేయను అంటూ డైరెక్టర్ మొఖాన్నే చెప్పేస్తుందట . ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి స్టార్ డమ్ దక్కించుకోవడానికి కాజల్ ఇప్పటికే తెలుగులో పలువురు హీరో సినిమాలను కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . చూడాలి మరి కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుందో..?