ఫైనల్లీ .. నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న విధంగా ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డును సాధించాడు బాలయ్య. మనకు తెలిసిందే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంక్రాంతికి రెండు బడా సినిమాలు ఒకటి రిలీజ్ అయ్యాయి. అందులో నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ఒకటి. మొదటినుంచి సంక్రాంతి రియల్ హీరోగా తన సత్తాను చాటుతూ వచ్చిన బాలయ్య ఈసారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమాను నిల్చోపెట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు .
సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా మొదటి షో తోనే హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . అంతేకాదు బాలయ్యను విమర్శించే వాళ్ళని కూడా తనను ప్రశంసించేలా చేసుకున్నాడు వీరసింహారెడ్డి . ఈ సినిమాలో మరీ ముఖ్యంగా బాలయ్య పర్ఫామెన్స్ హై రేంజ్ లో ఉండడం సినిమాకి మరింత ప్లస్ పాయింట్ గా మారింది. అంతే కాదు పొలిటికల్ పంచ్ పవర్ డైలాగ్స్ వదులుతూ తనదైన స్టైల్ లో దూసుకుపోయాడు బాలయ్య.
కాగా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డ్ ని నెలకొల్పింది. మరీ ముఖ్యంగా బాలయ్య కెరియర్ లోనే వీరసింహారెడ్డి హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ ను అందుకుంది . కాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య నటించిన వీర్సింహారెడ్డి సినిమా ఫస్ట్ డే 32 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు బాలయ్య సినిమాకు పోటీగా వచ్చిన ఇద్దరు కోలీవుడ్ హీరోలు సైతం బాలయ్య స్పీడుకు తట్టుకోలేకపోయారు. బాలయ్య నటించిన సినిమా 32 కోట్లు కలెక్ట్ చేస్తే ..కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ , అజిత్ నటించిన సినిమాలు 26.5 , 26 కోట్లతో సరిపెట్టుకున్నారు . విజయ్ నటించిన వారిసు సినిమా 26.5 కోట్లు కలెక్ట్ చేస్తే .. అజిత్ నటించిన తునివు సినిమా 26 కోట్లను కలెక్ట్ చేసింది . దీనితో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రియల్ విన్నర్ గా నిలిచాడు బాలయ్య..!!