ఏంటీ.. నాని సినిమా కోసం మృణాల్ ఎన్టీఆర్ కు నో చెప్పిందా?

మృణాల్ ఠాకూర్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ‌.. ఇక్క‌డ తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. రీసెంట్ గా తెలుగుతో ఈ బ్యూటీ రెండో సినిమాకు సైన్ చేసింది. అదే నాని 30. ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ చేస్తున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

 

నాని కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 30వ సినిమా ఇది. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌బోతున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగ‌బోతోంది. ఇందులో నానీకి జోడీగా మృణాల్ న‌టించ‌బోతోంది.

అయితే మృణాల్ కు సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. నాని సినిమా కోసం మృణాల్ ఏకంగా ఎన్టీఆర్ కు నో చెప్పింద‌ట‌. అస‌లేం జ‌రిగింంటే.. `ఎన్టీఆర్ 30`, `నాని 30` సినిమాల నుంచి ఒకేసారి మృణాల్ కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. అయితే ఈ రెండు చిత్రాల్లో నాని మూవీలోనే త‌న పాత్ర‌కు ఎక్కువ వెయిట్ ఉంటుంద‌ట‌. ఎన్టీఆర్ మూవీలో కేవ‌లం గ్లామ‌ర్ షోకు మాత్ర‌మే అన్న‌ట్లు హీరోయిన్ పాత్ర ఉంటుంద‌ట‌. ఈ కార‌ణంగానే నాని సినిమాకు సైన్ చేసి.. ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసింద‌ని జోరుగా టాక్ న‌డుస్తోంది.