పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో `ఉస్తాద్ భగత్ సింగ్` అనే మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది. తొలుత ఈ సినిమాను `భవదీయుడు భగత్‌సింగ్` టైటిల్ తో అనౌన్స్ చేశారు. కానీ, ఆ తర్వాత `ఉస్తాద్ భగత్ సింగ్` గా టైటిల్ ను మార్చారు.
ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా ఈ మూవీపై ఓ షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో తమిళ సూపర్ హిట్ ‘తేరి’ రీమేక్ గా `ఉస్తాద్ భగత్ సింగ్`ను తెరకెక్కిస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ కథనాలు పూకార్లే అని చాలా మంది నమ్మారు. కానీ, అదే నిజం. అవును, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరి రీమేక్. ప్రముఖ దర్శకుడు దశరథ్ ఈ విషయాన్ని రివిల్ చేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దశరథ్ స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. `హరీశ్ శంకర్ పవన్ తో తమిళ ‘తేరి’ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా స్ట్రక్చర్ తీసుకుని, చాలా మార్పులు చేసి అభిమానులకు నచ్చేలా ఉస్తాద్ భగత్ సింగ్ ను హరీష్ డిజైన్ చేస్తున్నాడు` అని దశరథ్ పేర్కొన్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఏడుపే ఏడుపు. ఎందుకంటే, అల్రెడీ తేరి తెలుగు వెర్షెన్ ను ఇక్కడి వారు చూసేశారు. ఇలాంటి సినిమాను రీమేక్ చేస్తే ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.