త‌మిళ గ‌డ్డ‌పై దిల్ రాజు ఇంగ్లీష్ స్పీచ్‌.. ప‌డి ప‌డి న‌వ్వుకోవాల్సిందే!

టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారిన దిల్ రాజు.. ఇప్పుడే ఏకంగా టాలీవుడ్ నే శాసించే స్థాయికి ఎదిగారు. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాల‌న్నీ పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్నాయి. ఈయ‌న నిర్ణ‌యంలో రూపుదిద్దుకున్న తాజా త‌మిళ‌ చిత్రం `వ‌రిసు(తెలుగు వార‌సుడు)`.

విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక మంద‌న్నా ఇందులో జంట‌గా న‌టించారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ‌ర‌త్ కుమార్‌, శ్యామ్ తదిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ గా నిర్మాతగా ఉన్న దిల్ రాజు వేదికపై మాట్లాడాల్సి వచ్చింది. సాధార‌ణంగా ఇతర రాష్ట్రాల్లో వారి భాష రాకున్నా సెల‌బ్రెటీలంద‌రూ ఇంగ్లీష్ తో మ్యానేజ్ చేసేస్తారు. కానీ, దిల్ రాజుకు ఇంగ్లీష్ భాషపై పట్టులేదు. త‌మిళం కూడా రాదు. అయితే కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు త‌మిళంలో కొన్ని ప‌దాలు బ‌ట్టీ బ‌ట్టారు. అయితే ఆ ప‌దాల‌కు వ‌చ్చీ రాని ఇంగ్లీష్ మిక్స్ చేసి.. వార‌సుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దిల్ రాజు బ‌ట్ల‌ర్ ఇంగ్లీష్‌కు నెటిజ‌న్లు ప‌డి ప‌డి న‌వ్వుకుంటున్నారు. ఎందుకంటే అంత ఫ‌న్నీగా ఆయ‌న స్పీచ్ ఉంది.

Share post:

Latest