కాలేజ్ ప్రొఫెసర్ గా చిరు.. మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రిఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలో చేసుకుంటూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సంక్రాంతికి యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ అందుకుని తన రేంజ్ ఏంటో మళ్లీ టాలీవుడ్‌కు చూపించాడు.

Chiranjeevi's Waltair Veerayya pre-release event will be held on this date  - News Portal

ఇక విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించి.. ఇప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మార్క్ కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే ప్రస్తుతం ఈ బంపర్ హిట్ ని ఎంజాయ్ చేస్తూనే మెహర్ రమేష్ దర్శకత్వంలో తన తర్వాత సినిమా బోళా శంకర్ షూటింగ్ కి రెడీ అయిపోతున్నారు. చిరంజీవిలో ఈ జోష్ ని చూసిన చాలా మంది దర్శకులు కూడా ఆయన దగ్గరకు వెళ్తున్నారు.

Megastar Chiranjeevi's 'Bhola Shankar' release date announced

ఈ క్రమంలోనే బోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి ఏ సినిమాను ఒప్పుకోలేదు. అయితే ఈ క్రమంలోనే వెంకీ కుడుముల మరోసారి చిరంజీవిని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఛ‌లో, భీష్మతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న వెంకీ కుడుములతో చిరంజీవి ఓ సినిమా కమిట్ అయ్యడని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమా కూడా అనౌన్స్ అయింది కానీ చిరంజీవి ఈ సినిమా కథలో భారీ మార్పులు కోరడంతో ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్ళింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ తో చిరంజీవి బిజీ అయ్యాడు.

Chiranjeevi And Filmmaker Venky Kudumula To Collaborate For A Mega Movie -  REPORTS

అయితే ఇప్పుడు వెంకీ కూడా చిరంజీవి చెప్పిన మార్పులతో కథను రెడీ చేసి మరోసారి మెగాస్టార్ ను కలవడంతో ఈ ప్రాజెక్టు మళ్ళీ ఆన్ లోకి వచ్చిందని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక చిరు ఈ కొత్త కథను ఇష్టపడి ఈ యువ దర్శకుడు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. వీటితో పాటు మరీ కొంతమంది యువ దర్శకులతో కూడా చిరంజీవి చర్చలు జరుపుతున్నారు.

What is Chiranjeevi's Net Worth In 2022?

ఈ సందర్భంలోనే వెంకీ ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తారో చూడాలి. ఇక ఈ యువ దర్శకుడకు ఇది అతి పెద్ద ఆఫర్, ఎందుకంటే తన మూడో సినిమాతోనే చిరంజీవిని డైరెక్ట్ చేయడమంటే మామూలు విషయంయం కాదు.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను యాక్షన్ ఫన్ డ్రామాగా తెర్కెక్కించబోతున్నారట. ఈ సినిమాలో చిరంజీవి కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక మరి ఈ సినిమాతో వెంకీ కూడా ఎలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారో చూడాలి.

Share post:

Latest