జనసేన-బీజేపీ ఫిక్స్…2024 తర్వాత టీడీపీ అవుట్?

ఏపీలో పొత్తులపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు..ఈ మధ్య కాస్త క్లారిటీ వస్తుందనుకునే లోపు..తాజాగా పవన్, ఇటు బి‌జే‌పి నేతల వ్యాఖ్యలతో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది. ఆ మధ్య చంద్రబాబు-పవన్ రెండు సార్లు భేటీ అయ్యారు..అయితే రాష్ట్ర సమస్యలపైనే చర్చించామని, పొత్తుల గురించి కాదని చెప్పుకొచ్చారు. అయినా సరే టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయిందని, ఇంకా సీట్లపైనే చర్చ నడుస్తుందని ప్రచారం జరిగింది.

అటు టి‌డి‌పి గాని, ఇటు జనసేన శ్రేణులు గాని పొత్తు గురించి మానసికంగా సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమకు బి‌జే‌పితో పొత్తు ఉందని, బి‌జే‌పితో కలిసే ఎన్నికలకు వెళ్తామని, కాదంటే ఒంటరిగా వెళ్తామని, కొత్త పార్టీలు కలిస్తే కొత్త పొత్తులు వస్తాయని, అయినా ఎన్నికల ముందు పొత్తుల గురించి మాట్లాడతామని అన్నారు. పవన్ వర్షన్ చూస్తుంటే కసత్ కన్ఫ్యూజన్ గా ఉంది. బి‌జే‌పితో అంటున్నారు..కొత్త పొత్తులు అంటున్నారు..దీంతో పొత్తులపై క్లారిటీ లేదు.

కానీ బి‌జే‌పి మాత్రం పూర్తి క్లారిటీతో ఉంది. తమకు జనసేనతోనే పొత్తు ఉందని, టి‌డి‌పి, వైసీపీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని క్లారిటీగా చెప్పేస్తున్నారు. అంటే జనసేనతోనే ముందుకెళ్తారు..మళ్ళీ టి‌డి‌పితో కలవడానికి రెడీగా లేరు. అలాంటప్పుడు పవన్..టి‌డి‌పితో కలవాలంటే బి‌జే‌పిని ఒప్పించాలి. బి‌జే‌పి ఒప్పుకోకపోతే..టి‌డి‌పిని పక్కన పెడతారా?లేక బి‌జే‌పిని పక్కన పెట్టి టి‌డి‌పితో వెళ్తారా? అనేది క్లారిటీ లేదు.

పైగా బి‌జే‌పి నేత విష్ణువర్ధన్ రెడ్డి జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామని, 2024 ఎన్నికల తర్వాత ఓ ప్రాంతీయ పార్టీ జెండా పీకేస్తుందని పరోక్షంగా టి‌డి‌పిని ఉద్దేశించి అన్నారు. అంటే టి‌డి‌పి లేకుండా పోతే జనసేనతో కలిసి ప్రధాన బి‌జే‌పి ఎదగవచ్చు అనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరికి బి‌జే‌పి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసలు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చూడాలి.