బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ప్రభాస్ కి అన్నగా ఆ స్టార్ హీరో .. ఇక ఫ్యాన్స్ కి అరుపులే..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ హీరో.. ప్రజెంట్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ .. మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నాడు . కాగా ఈ సినిమా అయిపోగానే ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో తీయబోతున్నాడు.

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హీట్ అవ్వడానికి కారణం కధ.. ఆ ప్లేస్ లో ఏ హీరోని పెట్టినా సరే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ సినిమా అనగానే జనాలు భారీ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ సినిమాలో ఆయనకి అన్నగా స్టార్ హీరో గోపీచంద్ ఫిక్స్ చేసుకున్నాడు సందీప్ వంగా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం రెబెల్ ఫాన్స్ కి పూనకాలు కాదు అరుపులనే చెప్పాలి . ప్రభాస్ – గోపీచంద్ ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఇక వీళ్లిద్దరు తెరపై కనిపిస్తే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడానికి అంత చిక్కడం లేదు. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?