బాలయ్య టైటిల్ తో వస్తున్న గోపీచంద్..ఈసారైనా హిట్ కొడతాడా..!

మన టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా ప‌లు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరి ఆ సినిమాల్లో తన హ్యాట్రిక్ దర్శకుడు శ్రీవాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా.. ఇప్పుడు రాబోయే మూడు సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తన ఫ్రెండ్ అయిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో సందడి చేశాడు.

rama banam, Gopichand 30: బాలకృష్ణ చెప్పిన టైటిల్‌నే ఖరారు చేసుకున్న గోపీచంద్ - gopichand 30th movie titled as rama banam which balakrishna suggested in unstoppable 2 show - Samayam Telugu

అందులో భాగంగా గోపీచంద్ సినిమాల గురించి బాలయ్య మాట్లాడుతూ శ్రీనివాస్ తో చేసే సినిమాకి గోపీచంద్ కు బాలయ్య టైటిల్ సజెస్ట్ చేశాడు. అయితే గోపీచంద్ సినిమాల పేరులో చివర లో అక్షరం ఒకటైతే నా సినిమాలో కూడా మధ్యలో ఉంటాయని మాట్లాడాడు. అలా తాను మీ హ్యాట్రిక్ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వాలని టైటిల్ పెడతానని అది ‘రామబాణం’ అంటూ బాలయ్య అనౌన్స్ చేశాడు. మరి ఇప్పుడు ఈ టైటిల్ ని ఈ సినిమా యూనిట్ సంక్రాంతి కానుకగా బాలయ్య మాటకి గౌరవం ఇచ్చి ‘రామబాణం’ టైటిల్ ని అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమాలో క్రాక్ సేమ్ డింపుల్ హయాతి హీరోయిన్‌గా లాక్ అయింది. జగపతిబాబు, కుష్బూ లాంటి అగ్ర తారలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కాగా.. మరికొద్ది రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా. భూపతి రాజు గోపీచంద్ 30వ‌ సినిమాకి కథ అందించాడు.