బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. 16 నెలలో అన్నిని సినిమాల..!?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు బాలయ్య. ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2022లో బాల‌య్య నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రాలేదు. 2022 మొత్తం తన క్యాలెండర్‌లో ఖాళీగా మిగిలిపోయింది. కానీ 2023వ‌ సంవత్సరంలో మాత్రం బాలయ్య వరుస సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నాడు.

ఈ సంవత్సరం బాలయ్య నుంచి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో గోపీచంద్ మలినేని- బాలకృష్ణ కాంబోలో వస్తున్న వీర సింహారెడ్డి. ఇక ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లో సందడి చేయబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన టీజ‌ర్‌, సాంగ్స్ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఇక ఈ సినిమా కంప్లీట్ మాస్ యాక్షన్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కింది.

ఈ సినిమాతో బాలయ్య 2021లో వచ్చిన అఖండ సినిమాను మించి అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఈ సినిమా తర్వాత కూడా బాలకృష్ణ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ద‌స‌రాను ని టార్గెట్ చేసుకుని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ త‌న తర్వాత సినిమాను బోయపాటి శ్రీను తో చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమాను 14 రీల్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది. అయితే బోయపాటి సినిమాను మాత్రం 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా థియేటర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ విధంగా చూసుకుంటే కేవలం 16 నెలలోనే ఏకంగా మూడు భారీ సినిమాలతో బాలకృష్ణ ప్రేక్షకుల‌ ముందుగా రాబోతున్నాడు. ఈ రకంగా బాలయ్య తన కెరియర్‌ను సూపర్ ఫామ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. తాను చేసే సినిమాల విషయంలో కూడా స్పీడ్ పెంచడంతో అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.