టాలీవుడ్ టైం ఇపుడు మామ్మూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో… ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దానికి కారకులు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు చేరింది. అయితే దానికి ముందే మన తెలుగు పరిశ్రమ రెమ్యునరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించేవారు. ఇక తాజాగా వచ్చిన ఈ మార్పుతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు.
వారిలో మొదట ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. తాజాగా 25వ సినిమా స్పిరిట్ కోసం రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నారని వినికిడి. ఇక తెలుగు యువకుల ఆరాధ్యుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆ తరువాత మహేష్ బాబు 55 నుండి 60 కోట్లు తీసుకుంటున్నట్టు భోగట్టా.
నందమూరి అభిమానుల ఆరాధ్యుడు Jr NTR రూ. 45 నుండి 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తన నెక్స్ట్ కొరటాల సినిమా కోసం ఏకంగా రూ. 60 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్ వినబడుతోంది. మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ కూడా రూ. 45 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక్కో సినిమాకి రూ. 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమాకి రూ. 60 కోట్ల వరకు తీసుకున్నారని వినికిడి.