పాన్ ఇండియా లెవెల్లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం RRR. ఈ సినిమా హాలీవుడ్ టెక్నీషియన్సీ సైతం ఆకట్టుకున్నది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ అని కనపరిచారని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పాటకు పలు రకాల రీల్స్ కూడ బాగా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది ఈ చిత్రం.
మెగా, నందమూరి అభిమానులకే కాకుండా యావత్ ఇండియన్ ఆడియన్స్ కి ఫేవరెట్ సాంగ్ మారిపోయింది. కీరవాణి తనదైన స్టైల్ లో సంగీతాన్ని అందించగా కాలభైరవ రాహుల్ సింప్లిగంజ్ బాగా అలరించారు. నాటు సాంగుకి బెంచ్ మార్క్ సాంగ్ గా రికార్డులకెక్కిన ఈ సాంగ్ హాలీవుడ్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఈ పాట రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో కష్టపడి చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తగ్గ ఫలితం కనిపించేలా ఈ పాటతో RRR కు ఆస్కార్ ని అందించేలా వండర్స్ క్రియేట్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఆస్కార్ ఇండియని వరించడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ ఊహాగానాలను నిజం చేస్తూ తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్లో ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించడం జరిగింది సీనియర్ అవార్డు కాలమిస్ట్ స్కాట్ ఫినార్గ్ అంచనా ప్రకారం నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి కింద ఈ పాటకి ఆస్కార్ అవార్డు వస్తుందని తెలియజేయడం జరిగింది. అయితే ఆయన చెప్పిన ప్రకారం 100% నిజమయ్యాయి అని అవకాశాలు బాగా వినిపిస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు కూడా RRR సినిమాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.