సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అన్నది ఎప్పటినుంచో పాతుకు పోయింది . ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఎంతోమంది హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి వచ్చి బ్రతికేస్తున్నారు . కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. శాండిల్ వుడ్, మలయాళం , హిందీ అన్ని ఇండస్ట్రీలోనూ ఇదే తంతు కొనసాగుతుంది . అయితే అందరు అన్ని భాషల్లోనూ కూతుర్లు హీరోయిన్గా నటించి కాస్త కూస్తో సక్సెస్ అయిన సందర్భాలే ఉన్నాయి . అదే మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఒక హీరో విషయంలో మాత్రం దారుణంగా పడిపోయింది. ఆయన మరెవరో కాదు.
టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్. ఒకప్పుడు హీరో రాజశేఖర్ పేరు చెప్తే జనాలకు ఎలా గూస్ బంప్స్ వచ్చేటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన నటించిన సినిమాలను ఇప్పటికీ టీవీలో వస్తే చూసే జనాలు ఉన్నారు . అంతలా తన నటనతో ఆకట్టుకున్న రాజశేఖర్ ప్రజెంట్ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోతున్నాడు. అంతేకాదు నాన్న పేరు చూసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన కూతుర్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ కూడా ఇండస్ట్రీలో డిజాస్టర్ గా మారారు .
నటన పరంగా సూపర్ టాలెంట్ ఉంది ..అందం పరంగా కూడా మెప్పించగలిగే సత్తా ఉంది.. అయినా కానీ ఎందుకో వీళ్ళకి మంచి సినిమా అవకాశాలు రావట్లేదు . ఫేడ్ అవుట్ హీరోల సరసన సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ ఒక్క స్టార్ హీరో సినిమాలో కూడా అవకాశాలు అందుకోవట్లేదు . దానికి మెయిన్ రీజన్ గతంలో రాజశేఖర్ టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరో తో జరిగిన గొడవే కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ ఆ గొడవ జరగకుండా ఉంటే నిజంగా శివాని ,శివాత్మిక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలేసే వాళ్ళని సోషల్ మీడియాలో ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే తల్లిదండ్రుల చేసిన తప్పులను పిల్లలపై రుద్దడం చాలా నేరం ..టాలీవుడ్ హీరోస్ కొంచెం పెద్దమనసు చేసుకొని శివాని, శివాత్మిక లో ఉన్న టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు ఇస్తే బాగుంటుంది అంటున్నారు రాజశేఖర్ ఫ్యాన్స్ . చూడాలి మరి వీళ్ళ కెరియర్ ఇండస్ట్రీలో ఎలా మారబోతుందో..?