టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో వున్న టాప్ హీరోలలో మహేష్ ఒకరు. మహేష్ వున్న ప్రత్యేకత మరే హీరోలోను లేదని చెప్పుకోవాలి. అవును, చాలావరకు హీరోలు సినిమాలు తప్ప మరే వ్యాపకం పెట్టుకోరు. అయితే మహేష్ దానికి భిన్నంగా వ్యవహరిస్తారు. తన రంగంలోనే గాక ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటాడు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కూడా రెండు చేతులనిండా గడిస్తున్నాడు.
ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ బిజినెస్ ప్లాన్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్. సినీ రంగంతో పాటు ఇతరత్రా రంగాల్లో కూడా తన మార్క్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బేసిగ్గా కృష్ణ వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కెమెరా ముందు తనదైన టాలెంట్ చూపిస్తూ అంచలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ అయ్యారు. తన భార్య అయినటువంటి నమ్రత సహకారంతో విభిన్నమైన వ్యాపారాలు ప్రారంభిస్తూ, రీల్ బిజినెస్మెన్ మాత్రమే కాదు రియల్ బిజినెస్మెన్ కూడా అని నిరూపించుకుంటున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం GMB ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. కాగా ఈ సంస్థ ద్వారా బిగ్ బడ్జెట్ సినిమాలు మహేష్ రూపొందిస్తున్నాడు. అలాగే AMB సినిమాస్ పేరుతో భారీ ఎత్తున గచ్చిబౌలిలో మల్టిప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక దాని తరువాత తాజాగా AM పేరుతో హైదరాబాద్, బంజారా హిల్స్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసారు మహేష్. ఇక AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటిగా ప్రస్తుతం వెలుగొందుతోంది.