సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారికి కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యాంకర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక ఆ తర్వాత ఒక మనసు సినిమాతో ఎవరు ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏవి సక్సెస్ కాలేదు. ఇక హీరోయిన్ గా సక్సెస్ కాలేమని భావించిన నిహారిక ఇంట్లో చెప్పిన పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది .
అయితే పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక రీసెంట్ గానే లైక్ షేర్ సబ్స్క్రయిబ్ అంటూ ఓ సినిమాను నిర్మించింది . బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేము కానీ ఓ మోస్తారు సంపాదించుకుంది ఈ సినిమా .కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తన మ్యారీడ్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే నిహారిక పొరపాటున మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యి.. అత్తగారిపై కామెంట్స్ చేసింది .
నిహారిక మాట్లాడుతూ..” మా అత్తగారు చాలా మంచివారు.. నేను మా ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నానో.. మా అత్తగారింట్లోను అంతే హ్యాపీగా ఉన్నాను . మా ఇంట్లో నేను ప్రిన్సెస్ మా అత్తగారింట్లో కూడా నేను ప్రిన్సెస్ నే..మా ఇంట్లో నేను నిద్రలేచేది 10 గంటలకు ..అప్పుడు కూడా మా అమ్మ, నాన్న తలుపు తట్టి నిద్రలేపుతారు. అయితే మా అత్తగారింట్లో నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు. నేను ఎంత సేపు నిద్ర పోయినా నన్ను ఏమీ అనరు. మా అత్తగారు ఆ విషయంలో దేవత.. కాళ్ళు మొక్కిన తప్పులేదు “అంటూ చెప్పుకొచ్చింది .
అయితే ఇదే విషయాన్ని క్యాచ్ చేసిన మెగా హెటర్స్ 10 గంటల వరకు అత్తగారింట్లో పడుకునే అదృష్టం నీకు దక్కినందుకు సంతోషపడు.. అమ్మ లాగా చూసుకునే అత్తగారు నీకు దొరికినందుకు ఆనందించు.. నువ్వు పెళ్లయ్యాక అంతసేపు పడుకోవడం ఆడపిల్ల లక్ష్ణం కాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు అమ్మగారింట్లో 10 గంటలు పడుకున్నాను అత్తగారింట్లో 12 గంటలు పడుకున్నాను అంటే కుదరదు ..ఆడపిల్లగా పుట్టాక కొన్ని పద్ధతులు అంటూ నీకు ఉండాలి అవి ముందు నేర్చుకో ఆ తర్వాత సినిమాలను నిర్మించుకో అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . ఏది ఏమైనా సరే నిహారిక ఏం మాట్లాడిన తప్పుగానే ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు .చూడాలి మరి నిహారిక ఇలాంటి ట్రోలర్స్ కి ఎలా ఘాటు కౌంటర్ ఇస్తుందో..?