ప్రముఖ భారతీయ విలక్షణ నటుడిగా పేరు గాంచిన హీరో కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. భారతీయ సినిమా అంటే ముఖ్యంగా మన సౌత్ సినిమా హిస్టరీని తీసుకుంటే మనం అద్భుతమైన సినిమాలు అనే చెప్పుకొనే సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి సినిమాలలో హీరో ఎవరని ఒకసారి తరచి చూసుకుంటే మాత్రం మనకి ఈయనే కనులముందు మెదులుతారు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాతల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని లోకనాయకుడు అనే బిరుదుని సంపాదించుకున్నాడు.
ఇక మరీ ముఖ్యంగా కమల్ హాసన్ సినిమాలు తీసుకుంటే హీరోయిన్లతో కెమిస్ట్రీ అంటే రొమాంటిక్ సీన్స్ మనకి ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అలాగే సినిమా పరిశ్రమలో సహజీవనం అనే కాన్సెప్ట్ ని మొదట తీసుకొచ్చింది కూడా కమల్ హాసన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమంటే కమల్ వయస్సు 70కి దగ్గరలో వుంది. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నదంటూ నిత్యం ఆయనపైన ఏదోఒక రూమర్ అనేది వస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై స్పందించింది సదరు స్టార్ హీరోయిన్. ఇక ఆమె మరెవరో కాదు, ప్రముఖ నటి పూజా కుమార్. ఇక ఈమె కమలహాసన్ తో కలిసి పలు సినిమాలలో నటించిన సంగతి విదితమే. అంతేకాకుండా కమల్ హాసన్ ఫ్యామిలీతో కూడా బాగా ఆమె కలిసి పోవడం వలన ఈ రూమర్స్ కి ఆజ్యం పోసింది. దానిగురించి ఆమె తాజాగా స్పందిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. అందరు అనుకున్నట్టు అదేమీ లేదని, ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా క్లోజ్ కావడం వలెనే ఇల్లాంటివి వస్తున్నాయని, దయచేసి ఇలాంటి రూమర్స్ ని క్రియేట్ చేయవద్దు అని తెలిపింది పూజా కుమార్.