శ్రీముఖి డ్రెస్‌పై ఆ హీరోయిన్ సంచలన కామెంట్.. ఏమన్నదంటే!

బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. బొద్దుగా కనపడే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో రకరకాల మోడ్రన్ డ్రెస్సులు ధరించి తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెలో హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన శ్రీముఖినే కనపడుతుంది. ఈ టీవీ, జీ తెలుగు, మా టీవీ, జెమిని టీవీ, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో కూడా ఈ అమ్మడు సందడి చేస్తుంది.

ఇక ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘బీబీ జోడి’ని కూడా శ్రీముఖి హోస్ట్ చేస్తుంది. ఇదొక డాన్స్ షో, బిగ్ బాస్ హౌస్ లోని కాంటెస్టెంట్స్ జోడిలుగా మారి బీబీ జోడిలో డాన్స్ పరఫార్మెన్స్ చేసి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ బీబీ జోడి లో సీనియర్ నటి రాధ, సదా మరియు తరుణ్ మాస్టర్ లు గెస్టులుగా ఉన్నారు. అయితే ఈ షోకి యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖి డ్రెస్సింగ్ స్టైల్ పై మాజీ హీరోయిన్ మాధవి లత షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. అంతేకాకుండా శ్రీముఖి ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మాధవిలత సలహా ఇచ్చింది.

‘శ్రీముఖి నువ్వు మోడ్రన్, ఆల్ట్రా మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటున్నావ్ కానీ నీ ఫిగర్ కి అవి సూట్ అవట్లేదు, కాబట్టి నీకు సూట్ అయ్యే బట్టలు వేసుకో’ అని ఉచిత సలహాలు ఇచ్చింది మాధవి లత. ‘నీ కళ్ళకు నచ్చిన బట్టలు వేసుకుంటే సరిపోదు, అవి నీకు సూట్ అవుతాయో లేదో అనేది చూసుకొని వేసుకుంటే బాగుంటుంది’ అని మాధవి లత శ్రీముఖి డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్స్ చేసింది. ఇక ఆమె చేసిన కామెంట్స్ నిముషాలలో వైరల్ అయింది. అంతేకాకుండా మాధవిలత కామెంట్స్ కి నెటిజనులు కూడా సపోర్ట్ చేస్తున్నారు.