అఖండ హిట్ తర్వత నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కుడా చిత్ర యునిట్ ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో ఒక్కసారిగా భారీ అంచానలు పెరిగిపోయాయి.
ఈ సినిమా టెక్నికల్ వర్క్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ఎస్. థమన్ అదిరిపోయే అప్డేట్ బయటకి వదిలాడు. ఈ సినిమా పాటలు మొత్తం కంప్లిట్ అయ్యి.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలు పెట్టామని చెప్పడంతో పాటు జై బాలయ్య అంటూ పోస్ట్ పెట్టాడు. అలాగే ఆ పోస్ట్ లో అ సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేని, మరియు సాహిత్య రచయత రామజోగయ్య శాస్త్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
అఖండ తర్వాత బాలయ్య, థమన్ కలిసి చేస్తున సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాకు కూడా థమన్ అఖండను మించి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడని బాలయ్య అభిమనులు భావిస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య సాంగ్ ఊపేస్తోంది. రేపు థియేటర్లలో కూడా థమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌తో దద్దరిల్లిపోయేలా చేస్తాడనే అంటున్నారు. శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
#NBK107 #VeeraSimhaReddy Compositions Completed Starting the BGM Works Now #Jaiballaya 🔥❤️@ramjowrites @megopichand 🥁🥁🥁🥁 pic.twitter.com/aEzPXIzwO9
— thaman S (@MusicThaman) December 3, 2022
.