RC -16 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత కొన్ని వివాదాల చేత వాయిదా పడుతూ వస్తోంది.ప్రస్తుతం శంకర్ మరొక షెడ్యూల్లో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన 15వ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టును డైరెక్టర్ బుచ్చిబాబుతో మొదలు పెట్టబోతున్నట్లుగా గడిచిన కొద్ది రోజుల క్రితం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

RC 16: బుచ్చిబాబు సానతో రామ్ చరణ్ మూవీ పోస్టర్ రిలీజ్..!! | NewsOrbitరామ్ చరణ్ తన సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతోనే సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు.ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కంటెంట్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో సరికొత్త ప్రజెంటేషన్గా కనిపించబోతున్నట్లు సమాచారం. కంటెంట్ పరంగా బాగానే ఉన్న కమర్షియల్ ఆడియన్స్ కు నచ్చే విధంగా రామ్ చరణ్ కూడా చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల స్క్రిప్ట్ పనులు కాస్త తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక శంకర్ సినిమాని సమ్మర్లో ముగించేస్తున్నారు.. కాబట్టి కేవలం ఒక నేల గ్యాప్ తర్వాత బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రామ్ చరణ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్ నెలలో లేదంటే మే నెలలో మొదలుపెట్టి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ మొత్తాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఎలాంటి మార్పులు లేకుండా ముందుగానే స్క్రిప్ట్ ని బ్లాక్ చేసుకున్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి మరి.