టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మొత్తం వెకేషన్లకే కేటాయించినట్టు ఉన్నారు. 2022 మొదలు ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు వెళ్ళొస్తూనే ఉన్నారు. అక్టోబర్ లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్ సితారతో కలిసి లండన్ పర్యటన చేసిన మహేష్.. తాజాగా మరోసారి వెకేషన్ కు బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ దర్శనం ఇవ్వడంతో.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈసారి మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. కాగా, సర్కారు వారి పాట హిట్ అనంతరం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇంతలోనే మహేష్ ఇంట్లో వరుస విషాదాలు నెలకొన్నాయి. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. కానీ మహేష్ మళ్ళీ వెకేషన్ వెళ్లడంతో.. ఈ ఏడాది షూటింగ్ లేనట్టే అని అంటున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.