ధమాకా చిత్రం ఫస్ట్ ఛాయస్ రవితేజ నేనా..?

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒక హీరో చేయాలనుకున్న సినిమాను మరొక హీరో వద్దకు వెళ్లడం సర్వసాధారణం. కొన్నిసార్లు అలా వెళ్ళిన కథలు ప్లాప్ గా మిగులుతాయి మరికొన్ని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటు ఉంటాయి. అయితే కొన్నిసార్లు స్టార్ హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను తమకు పెద్దగా సూట్ కావని పక్కన పెట్టేస్తూ ఉంటారు.అలా రామ్ చరణ్ కూడా పక్కకు పెట్టేసిన కథే రవితేజ వద్దకు వెళ్లగా ఆ చిత్రం మంచి విజయ దిశగా దూసుకుపోతోంది ఆ చిత్రమే ధమాకా.

Ram Charan: Did Charan Sense The Flop Of Dhamaka? Is This Why It Was  Rejected?
డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూలు రాబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓవర్సీసులో సత్తా చాటుతూ భారీ కలెక్షన్లను అందుకుంటోంది. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమా కథ అందించిన ప్రసన్నకుమార్ బెజవాడ ముందు ఈ సినిమా కథను రామ్ చరణ్ కు వినిపించారట. అయితే స్టోరీ అంత లాజిక్కుకు దూరంగా ఉండడంతో రామ్ చరణ్ ఈ కథను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

ఇక తర్వాత ఇదే కథని ఇండస్ట్రీలో చాలామంది క్రేజీ హీరోలకు చెప్పారు ప్రసన్నకుమార్.అయితే అందులో ఏ హీరో పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాతే ఈ స్టోరీని రవితేజకు చెప్పగా బాగా నచ్చడంతో ఫైనల్ గా ఈ కథ విని రవితేజ నచ్చడంత సేల్స్ పైకి తీసుకువెళ్లారు. అయితే ఈ సినిమా ఇంద్ర మూవీని స్పూప్ రీ క్రియేట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.