అదే నీకు మైన‌స్ అంటూ మాట‌ల‌తో గుచ్చారు.. శ్రుతి హాస‌న్ ఆవేద‌న‌!

అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి శ్రుతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. అలాగే మరో వైపు ప్రభాస్‌కి జోడిగా శ్రుతిహాసన్ `స‌లార్‌` మూవీలో నటిస్తోంది. వీటితో పాటు హాలీవుడ్. కోలీవుడ్ భాషల్లో పలు ప్రాజెక్ట్ లు టేకప్ చేసిన ఈ భామ‌.. తాజాగా ఓ భేటీలో పాల్గొంది. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే తన హైట్ గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

కెరీర్ కొత్తలో కొందరు అంత ఎత్తుగా ఉన్నావేంటి..? నీ హైట్ నీకు మైనస్ అంటూ మాటలతో గుచ్చేవారు. వారి కామెంట్స్ నన్ను ఎంతగానో బాధించాయి. కానీ, ఆ తర్వాత నా హైటే నాకు ప్లస్ పాయింట్ అని గ్ర‌హించాను. నా హైట్ కారణంగానే ప్రభాస్, మహేష్ లాంటి హీరోలకు జోడిగా నటించే అవకాశం వచ్చింది.` అంటూ శ్రుతి చెప్పకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్‌ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారాయి.