గుడివాడలో రగిలిన చిచ్చు..రావి వర్సెస్ కొడాలి వర్గం.!

గుడివాడలో మరోసారి రచ్చ లేచింది…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇప్పటివరకు రాజకీయ పరమైన గొడవలే ఉంటే..ఇప్పుడు ఏకంగా కొట్టుకునేవరకు వెళ్ళిపోయారు. డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం చేయడానికి టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు సిద్ధమయ్యారు..కానీ ఆ కార్యమాన్ని చేయొద్దని కొడాలి నాని అనుచరుడు కాళీ..రావికి ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిసింది.

ఆ వెంటనే రావి పోలీసులకు ఫిర్యాదు చేసి..పార్టీ ఆఫీసుకు రాగా, కొడాలి అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో వచ్చి టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని, రావిని టార్గెట్ చేశారని , అయినా సరే పోలీసులు కొడాలి వర్గాన్ని నిలువరించకుండా..టీడీపీ వర్గంపై లాఠీచార్జ్ చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య రగడ లేచింది..పోలీసులు చాలాసేపటికి ఈ గొడవ సద్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది.

భగ్గుమన్న గుడివాడ: టీడీపీ-వైసీపీ ఘర్షణ: మా దగ్గర అంతకంటే పెద్ద రాళ్ళే  ఉన్నాయ్ | Tension prevails in Gudivada after YSRCP leaders threten to the  ex MLA Raavi Venkateswara Rao - Telugu Oneindia

అయితే రంగా వర్ధంతి చేస్తే..కాపుల్లో మళ్ళీ టీడీపీకి పట్టు పెరుగుతుందనే భయంతోనే కొడాలి నాని అనుచరులు ఇలా దాడులకు దిగారని, ఎట్టి పరిస్తితుల్లోనూ రంగా వర్ధంతి చేసి తీరుతామని రావి అంటున్నారు. కానీ పోలీసులు పర్మిషన్ ఇచ్చేలా లేరు. ఇప్పటికే గుడివాడలో రాజకీయం మంచి జోరుగా సాగుతుంది. అధికార బలంతో ఉన్న కొడాలికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రావితో పాటు ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము టీడీపీలో దూకుడుగా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి పనిచేయడానికి కూడా రెడీ అయ్యారు.

ఇక జరుగుతున్న పరిణామాలని గుడివాడ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు..గతంలో ఈ స్థాయిలో దాడులు జరగడం చాలా అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి కామన్ అయిపోయాయి. మొత్తానికి ఈ దాడులు ప్రభావం కూడా ఎన్నికల సమయంలో పడే ఛాన్స్ ఉంది.