కాంతార వివాదం ముగిసేలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `మిషన్ మజ్ను` విడుదల కోసం సిద్ధమైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మిషన్ మజ్ను కు సంబంధించి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. సౌత్ ను తక్కువ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చిన్నతనం నుంచి బాలీవుడ్ సాంగ్స్ చూస్తూ పెరిగానని.. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయని రష్మిక పేర్కొంది. అక్కడితో ఆగలేదు.. దక్షిణాది సినిమాల్లో మాస్ మసాలా సాంగ్స్, ఐటమ్ నెంబర్స్ మాత్రమే ఉంయంటూ నోటి దురద చూపించింది.
దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. సౌత్ సినీ ప్రియులు ఎంత తల పొగరు అంటూ రష్మికపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు నార్త్ లో ఉన్నావు.. అలాంటిది సౌత్ ని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ చురకలు వేస్తున్నారు.