అడవి శేషు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడవి శేషు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించి వరుస విజయాలను అందుకుంటు ఉన్నారు. తాజాగా హీట్ -2 చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అడవి శేషు ఎంచుకున్న కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చేత.. ఈ నటుడు సినిమా మినిమం గ్యారంటీ సినిమా అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మేజర్ సినిమా విజయం తర్వాత మళ్లీ అంతటి విజయాన్ని హీట్ -2 సినిమా అందుకుంది.

With 3 Films, Adivi Sesh Dominates IMDB List Of Top 25 Telugu Movies

ఇక అడవి శేషు ఒక సంస్థ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సైన్ చేశారట .అందుకు కాను భారీ గాని రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా అందుకోసం రూ.50 లక్షల రూపాయలు అడవి శేషు పారితోషకంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు ఇంతటి పారితోషకం తీసుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా చేసేందుకు మాత్రమే కాకుండా పలు సినిమాలలో నటించేందుకు కూడా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

దాదాపుగా ఇప్పుడు ఒక చిత్రానికి రూ.12 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిర్మాతలు కూడా ఇంతటి రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అడవి శేషు ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. ఒకవైపు బ్రాండ్ అంబాసిడర్ గా బాగా సంపాదిస్తూ మరొకవైపు సినిమాలపరంగా భారీగానే సంపాదిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అడవి శేషు వివాహం గురించి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ శుభవార్తను ఎప్పుడూ తెలియజేస్తారో చూడాలి మరి.