డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఇదే క్రమంలోని జెడి చక్రవర్తితో రంభ కొన్ని చిత్రాలలో నటించింది. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కోదండరాముడు సినిమాతో కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి పై రంభ షాకింగ్ కామెంట్లు చేసింది. జెడి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ తన పెళ్లికి రాలేదని అప్పట్లో చాలా నిరుత్సాహపడ్డారని కూడా తెలిపింది. తనకున్న అతి కొద్ది మంది ఫ్రెండ్స్ లో జెడి చక్రవర్తి కూడా ఒకరిని అయితే ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే విషయంలో అతను ఒక పెద్ద అబద్దాల కోరు అని కూడా తెలియజేసింది. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా రంభ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు.
ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన రంభ ప్రస్తుతం ఫెడౌట్ హీరోయిన్గా మారిపోయింది. అయినా కూడా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో నటిస్తూ ఉంటోంది. ఇక గతంలో రంభకు తన భర్తతో విభేదాలు ఉన్నాయని డివర్స్ తీసుకుంటోందనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి.ఆ తరువాత ఆ సమస్యలు సర్దు మునగాడంతో వీరు ప్రస్తుతం అన్యోన్యంగా కలిసి ఉంటున్నారట.ఇటీవల తన పిల్లలతో కారులో వెళుతున్న రంభ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కోలుకొని చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలియజేస్తోంది రంభ.