వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రభాస్ అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు -k, ఆది పురుష్, సలార్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా మరొక చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా అయిపోయిన వెంటనే స్పిరిట్ సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారని సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ,నయనతార ఇద్దరు కలిసి గతంలో యోగి చిత్రంలో మాత్రమే నటించారు. ఈ చిత్రం 2007లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చింది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు కలిసి వీరిద్దరూ నటించబోతున్నారు. కోలీవుడ్లో నయనతార ఒక బ్రాండ్ గా పేరు సంపాదించిందని చెప్పవచ్చు. తన సినిమాలతో లేడీస్ సూపర్ స్టార్ గా కూడా మంచి క్రేజ్ ను అందుకుంది.
దాదాపుగా ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ వంగ తన స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల కంటే స్పిరిట్ సినిమా మరింత గా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని షేర్ చేయడానికి ప్రభాస్ తన చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.