పూజా హెగ్డే త‌ట్టా బుట్టా స‌ర్దుకోవ‌డ‌మే మిగిలిందా…!

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల‌లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం మాత్రం అన్ని విధాలుగా నిరాశే మిగిల్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని నిరాశపరిచింది. ఆ సినిమా ఈ సంవత్సరంలో అత్యంత భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.

Radhe Shyam: Pooja Hegde Shares An Update On The Film's Release

ఆ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు జంటగా నటించిన బీస్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమాతో కూడా పూజా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జంటగా నటించింది పూజా.. ఆ సినిమా కూడా ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇక తర్వాత ఎఫ్ 3 సినిమాలో ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డే ఆ పాటతో కూడా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Ram Charan, Pooja Hegde's romantic poster for Acharya's Neelambari song |  123telugu.com

ఈ సంవత్సరం చివరిలో బాలీవుడ్ లో రణవీర్ సింగ్ కు జంటగా నటించిన సర్కస్ సినిమాతో పూజా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశ మిగిల్చింది. ఈ సంవత్సరం పూజాకు అత్యంత దారుణమైన సంవత్సరం అనే చెప్పాలి.. ఈ సంవత్సరం ఆమెకు అన్ని విధాలుగా ఫెయిల్యూర్లే మిగిలాయి.. 2023 పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Pooja Hegde starts dubbing for her Telugu film Ala Vaikunthapurramloo

వచ్చే కొత్త సంవత్సరంలో ఆమె మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. తర్వాత సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఎన్నో అంచనాల నడుమ వస్తున్న ఈ రెండు సినిమాలతో పూజా 2023లో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. పూజా హెగ్డే తెలుగు, తమిళం మరియు హిందీ భాషలో నుంచి ఆఫర్లను దక్కించుకుంటుంది కానీ సక్సెస్ లను మాత్రం సొంతం చేసుకోలేక పోతుంది. 2023 లో కూడా ఫెయిల్యూర్స్ అయితే ఆమె కెరీర్ ఖతం అయినట్లే.