ఒక్కే సినిమాలో మహేష్ బాబు – పవన్ కళ్యాణ్..? ఇది కదారా అభిమానులకి కావాల్సింది..!

ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమంలోనైనా ఫ్రాంచైజ్‌ల ట్రెండ్ గట్టిగా నడుస్తింది… బాహుబలి, కే జి ఎఫ్, కార్తికేయ 2, ఇక నిన్న విడుదలైన హిట్‌2 సినిమా ఇలా సిరీస్ సినిమాలు అన్నీ విడుదలై సూపర్ హిట్ అవడంతో దర్శకులు కూడా ఇప్పుడు సిరీస్ లు తీసే ఆలోచనలో పడిపోయారు. ఇక త్వరలోనే టాలీవుడ్ లో పుష్ప2 , ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నిన్న విడుదలైన హిట్ 2 సినిమా 2020లో వచ్చిన హిట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలను నాచురల్ స్టార్ నాని నిర్మించగా నూతన దర్శకుడు శైలేష్ తెరకెక్కించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సీరీస్ ను 7 భాగాలుగా తీయాలని నాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.త్వరలోనే హిట్ 3 సినిమాను కూడా మొదలు పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు న‌టిస్తారని సమాచారం. ఏడవ భాగంలో నాని హీరోగా నటిస్తారని తెలుస్తుంది. మిగిలిన భాగాలలో పవన్ కళ్యాణ్, మహేష్ కూడా నటిస్తారనే టాక్‌ గట్టిగా నడుస్తుంది.

Tollywood: Mahesh Babu's fans breaks record of Pawan Kalyan's fans

ఇక చివరి 7 వ భాగం లో వీళ్ళందరూ కలిసి ఒక్క అతి పెద్ద కేసు ని పరిష్కరిస్తారని..హిట్ ఫ్రాంచైజ్ రాబోయే రోజుల్లో అతి పెద్ద ఇండియన్ ఫ్రాంచైజ్ గా ఉండబోతుందని ఒక టాక్ గట్టిగా వినిపిస్తుంది..మరి ఇందులో ఎంతవరుకు నిజం ఉందో చూడాలి..ఈ 7 సినిమాలను న్యాచురల్ స్టార్ నానీ తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కిస్తాడట.

Share post:

Latest