నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్గా నూతన దర్శకుడు శైలేష్ డైరెక్షన్లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 సినిమాలో హీరోగా అడివి శేష్ నటించాడు. ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కూడా అడవి శేష్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాగా నిలిచింది. అయితే ఈ హిట్ సిరీస్ ని 7భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాని దర్శకుడు శైలేష్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హిట్ 3 కూడా అనౌన్స్ చేశారు.
హిట్ 3లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తారని తెలుస్తోంది. రాబోయే మిగిలిన సిరీస్లో కూడా టాలీవుడ్ లో ఉన్న మరో నలుగురు స్టార్ హీరోలు నటిస్తారని సమాచారం. ఈ సినిమాను నాని పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హీరోస్ తో సినిమాలను ప్లాన్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో చివరి సినిమాలో ఏడుగురు హీరోలు దేశవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ చేసేలా సినిమా ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాలపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ హిట్ సీరీస్ లో సమంతా కూడా నటించబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీనికి ప్రధాన కారణం హిట్ 2 ప్రమోషన్ లో భాగంగా హీరో అడివిశేష్ ను ఓ జర్నలిస్ట్ హిట్ సిరీస్లో సమంతను హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని ఆ జర్నలిస్ట్ అడగగా.. దానికి అడివి శేష్ స్పందిస్తూ.. మీ ఐడియా బాగుంది మరి సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఈ విషయంపై సమంత తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. ఏ రౌడీ పోలీస్.. ఈ మాట వినడానికి ఏదో ఫన్నీగా ఉంది కదూ.. హిట్ సినిమా సూపర్ హిట్ అయినందుకు నీకు అభినందనలు.. అడవి శేష్ మీ విషయంలో నేను ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటాను.. అని సమంత తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. సమంత కూడా ఈ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో రాబోయే సిరీస్లో సమంత కూడా భాగమవుతుందని తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుందని సమాచారం.