ప‌వ‌న్ ఖుషి క్రేజ్ మాములుగా లేదుగా.. ‘అవతార్‌ 2’ని తొక్కేసిందిగా..!

మెగా స్టార్ చారంజీవి త‌మ్ముడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాన్ తెలుగులో త‌న‌కంటు ఒక ప్ర‌త్యేక‌మైన ప్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. త‌న సినిమా వ‌స్తుంది అంటే అయ‌న అభీమ‌నుల‌కు పండుగాల ఉంటుంది. అయ‌న‌కు హిట్ ప్లాప్‌లుతో సంబందం లేకుండ సినిమాలు చేసుకుంటు పోతున్న‌రు. ప్ర‌స్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఎంతో క్రియాశీలకంగా ఉన్నారు.

ప‌వ‌న్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలో ఖుషి ఒక‌టి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు. ఖుషి సినిమా పవన్ కెరియ‌ర్‌కు ఖుషి సినిమా తర్వాత ఖుషి సినిమాకు ముందు అన్న రేంజ్ లో ప‌వ‌న్‌కు హిట్ ఇచ్చింది. అంతేకాకుండా అప్పట్లో ఉన్న టాలీవుడ్‌లో రికార్డ్స్ అన్నింటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఖుషి. ఇప్పుడు టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan | ఏపీలో అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో చెప్పిన పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషి సినిమాని రీరిలీజ్ చేస్తే చూడాలి అని లక్షలాదిమంది కోరుకుంటున్నారు. ఈ అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను డిసెంబర్ 31న‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రీరిలీజ్‌ చేయనున్నారు.ఈ విషయం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ అభిమానులు సోషల్ మీడియాలో ఖుషి సినిమా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తునే ఉన్నారు.

Avatar 2 Dijuluki Film Paling Susah yang Pernah Dibuat | Republika Online

ఇకపోతే బుక్ మై షో లో అభిమానులు ఈ సినిమా టికెట్స్ ని బుక్ చేసుకున్నందుకు వెత‌క‌డం మొదలు పెట్టగా అలా ఒకేసారి కోన్నివేలాదిమంది బుక్ మై షోలో ఖుషి సినిమా కోసం సెర్చ్ చేయడం వల్ల అవతార్ 2 సినిమా ని కూడా ప‌వ‌న్‌ వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో ట్రేడింగ్ అవుతుంది ఖుషి సినిమా. ఇప్పుడు ఈ వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ విధంగా స్పందిస్తూ ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభమైతే ఏ విధంగా ఉంటుందో అని అనుకుంటున్నారు. ప‌వ‌న్ ఈ రీరిలీజ్ సినిమాతో ఎలాంటి రికార్డ్‌లు సృష్టిస్తారో చూడాలి.