జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే..?

అందం అభినయం రెండు ఆమె సొంతం.. శ్రీదేవి అందంతో పోటీ పడగలిగిన ఏకైక అందం జయప్రద సొంతమని చెప్పాలి. కొన్ని సంవత్సరాలపాటు తన అందం ,నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, కృష్ణ , కృష్ణంరాజు, చిరంజీవి ఇలా అందరితో కూడా నటించి మెప్పించింది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరింది. అయితే కొన్ని కారణాలవల్ల బిజెపి తీర్థం పుచ్చుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ శుక్రవారం ఆహా లో ప్రసారం కాబోయే బాలయ్య అన్ స్టాపబుల్ షో కి జయప్రద గెస్ట్ గా హాజరయ్యారు.

Rampur MP MLA Court issues non bailable warrant against film actress  Jayaprada, Newstrack Rampur, Rampur News in Hindi, Latest Rampur News,  Newstrack Samachar | Rampur News: फ़िल्म अभिनेत्री जयाप्रदा के खिलाफ अदालत

ఈ నేపథ్యంలో తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త వెలుగులోకి వచ్చింది.. జయప్రదకు షాక్ ఇస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. అసలు ఏం జరిగింది అంటే.. ఉత్తరప్రదేశ్ కి చెందిన రాంపూర్ ప్రత్యేక కోర్టు జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రెండు కేసుల విచారణ సందర్భంగా జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో.. రాంపూర్ ప్రత్యేక ఎంపీ , ఎమ్మెల్యే కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

ఈ విషయంపై రాంపూర్ న్యాయవాది అమర్నాథ్ తివారి మాట్లాడుతూ..” విచారణ సమయంలో మాజీ ఎంపీ నటి జయప్రద వరుసగా హాజరు కాకపోవడం వల్ల కోర్టు జయప్రద తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదను కోర్టులో హాజరు పరచాలని రాంపూర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ను ఈ సందర్భంగా కోరుతూ ఆదేశించింది”. ఈ కేస్ తదుపరి విచారణ జనవరి 9 కి వాయిదా పడింది.