యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ కు బయలుదేరారు. రెండు నెలల క్రితమే ఫ్యామిలీతో టూర్ వేసిన ఆయన ఇప్పుడు మరోసారి వెకేషన్ కోసం అమెరికా వెళ్తున్నారని తెలుస్తోంది. భార్య లక్ష్మీ ప్రణీత, కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు.
అమెరికాలోనే ఫ్యామిలీతో ఎన్టీఆర్ కొద్ది రోజులు ఎంజాయ్ చేయబోతున్నాడట. ఇప్పట్లో రిటర్న్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. కొత్త ఏడాదికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్కడే వెక్కమ్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగకు ముందు మళ్ళీ ఎన్టీఆర్ ఇండియాకు రానున్నాడని సమాచారం.
కాగా, ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూనే వస్తుంది. అయితే సంక్రాంతి అనంతరం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.