నెల్లూరు సిటీలో వైసీపీ-టీడీపీల్లో ట్విస్ట్‌లు..సీటు పోటీ?

వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీలో రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ఇక్కడ రెండు పార్టీల్లో సీటు విషయంలో పోటీ ఉంది. రెండు పార్టీల నుంచి సిటీ సీటు ఆశించే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఎంతమంది పోటీ పడుతున్నారు..ఈ సీటులో ప్రస్తుతం పరిస్తితి ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే..ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణపై స్వల్ప మెజారిటీ తేడాతో అనిల్ గెలిచారు..మంత్రి అయ్యారు.

తర్వాత మంత్రి పదవి పోవడంతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఎమ్మెల్యేగా అనిల్..నెల్లూరు సిటీలో చేసిన అభివృద్ధి తక్కువే అని తెలుస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రిగా పనిచేసిన నారాయణ నెల్లూరు సిటీలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నారాయణతో పోలిస్తే ఇప్పుడు అనిల్ చేసేది తక్కువే అని అంటున్నారు. ప్రస్తుతానికైతే సిటీలో అనిల్‌కు అంతగా పాజిటివ్ కనిపించడం లేదు.

ఇక నెక్స్ట్ ఆయనకు సీటు ఇస్తారా? లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ జగన్ సన్నిహితుడుగా ఉండే అనిల్‌ని కాదని మరొకరికి సీటు ఇవ్వడం జరిగే పని కాదు. కాకపోతే ఈ సీటు కోసం కొందరు పోటీ పడుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి..సిటీ సీటు ఆశిస్తున్నారు. వైసీపీలో సీటు దక్కకపోతే టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమార్తె ప్రశాంతి రెడ్డి సైతం సిటీ సీటు అడుగుతున్నారు. అది కాకపోతే రూరల్ లేదా కావలి సీటు అడుగుతున్నట్లు సమాచారం. మెయిన్ మాత్రం సిటీ సీటు.

అటు టీడీపీలో కూడా సీటు కోసం పోటీ ఉంది. టీడీపీకి అనుకూల వాతావరణం ఉండటంతో..ఇక్కడ మాజీ మంత్రి నారాయణ మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆయన బరిలో దిగకపోతే..ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరోకరు పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ వైసీపీలో సీటు దక్కకపోతే ఆనం టీడీపీలోకి వచ్చి సిటీ సీటుని దక్కించుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి ఇలా నెల్లూరు సిటీ సీటు కోసం గట్టి పోటీ ఉంది.