బాల‌య్య‌పైనే హనీ రోజ్ ఆశ‌లు.. హిట్ కొడ‌తే సీనియ‌ర్ హీరోలు వ‌దులుతారా?

హనీ రోజ్.. `బాయ్ ఫ్రెండ్` అనే మ‌ల‌యాళ మూవీతో ఈ అందాల సోయ‌గం సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేసి న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాపిక్ ఎందుకు వ‌చ్చింది అంటే.. హ‌నీ రోజ్ త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది.

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని `వీర సింహారెడ్డి` అనే మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ ను తెర‌కెక్కించిన‌ సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ తో పాటు హ‌నీ రోజ్‌ కూడా హీరోయిన్ గా నటించింది. బాలయ్య భార్యగా హ‌నీ రోజ్‌ కనిపించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తెలుగులో హ‌నీ రోజుకు ఇది మూడో చిత్రం. ఇంత‌కు ముందు ఈమె తెలుగులో ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా సినిమాలు చేసింది. ఇవి ఆమె కెరీర్ కు ఏమీ ఉప‌యోగ‌ప‌డ‌లేదు. దీంతో హ‌నీ రోజ్ ఆశ‌ల‌న్నీ బాల‌య్య‌పైనే పెట్టుకుంది. ఇక `వీర సింహారెడ్డి`తో హ‌నీ రోజ్ హిట్ కొడ‌తే టాలీవుడ్ లో ఆమె ద‌శ తిర‌గడం ఖాయమ‌ని అంటున్నారు. అస‌లే టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల కొర‌త భారీగా ఉంది. ఇలాంటి త‌రుణంలో హ‌నీ రోజ్ సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్ఫెక్ట్ ఛాయిస్‌గా క‌నిపిస్తోంది. `వీర సింహారెడ్డి` మంచి విజ‌యం సాధిస్తే సీనియ‌ర్ హీరోలు హ‌నీ రోజ్ ను అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు అన‌డంతో సందేహ‌మే ఉండ‌దు.