సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చిన నాగబాబు కచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. పొలిటికల్‌గా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోయినా మెగా కుటుంబం పైన ఏవైనా కామెంట్లు వస్తే మాత్రం తట్టుకోలేరని వార్తలు మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. చిరంజీవి మాత్రం అందరికీ మంచి చేయాలని భావిస్తూ ఉంటారు.చిరంజీవి ఎంత మంచిగా ఉన్నా కొన్ని సందర్భాలలో మాత్రం పలు రకాలుగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.
చిరంజీవిపై వస్తున్న విమర్శల గురించి ఆయనపై నెగటివ్ కామెంట్స్ చేసిన వాళ్ల గురించి నాగబాబు చాలా ఘాటుగా స్పందించారు. తాజాగా నాగబాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారు. చిరంజీవి గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే మొదట ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ వస్తుందని కూడా నాగబాబు తెలియజేయడం జరుగుతుంది. సినీ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి వెళ్లిన సమయంలో కొంతమంది రాజకీయ నేతలు చిరంజీవి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగబాబు తెలియజేశారు.
ఆయన పెద్ద నాయకుడు అయినంత మాత్రాన ఆయనను మేమేమి అనలేదని నాగబాబు కామెంట్లు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవించాలని కూడా తెలిపారు. దీంతో పలువురు నెటిజన్ల సైతం మాట్లాడుతూ ఎప్పుడు ఏదో ఒక విధంగా వైరల్ గా మారుతూ ఉంటారు నాగబాబుగారు పొలిటికల్ పరంగా కూడా ఎవరో ఒకరి మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. దీనివల్ల మెగా ఫ్యామిలీ పరువు పోతోంది అంటూ పలువురు అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది పదేపదే రాజకీయ నేతలని ఇలా ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో ఏదైనా తేడా వస్తే ఇక అంతే అని కూడా కామెంట్లు చేస్తున్నారు.