ర‌కుల్ ఇంట్లో తీవ్ర విషాదం.. వైర‌ల్ గా మారిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. గత 16 ఏళ్ల నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రకుల్ పెట్ డాగ్ బ్లాసమ్ మరణించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ తన పెట్ డాగ్ గురించి ర‌కుల్‌ ఓ పోస్ట్ పెట్టింది. `బ్లాస‌మ్‌ నువ్వు మా జీవితాల్లోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది.

మా లైఫ్ లోకి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చావు. ఇకపై నిన్ను మేము ఎంతో మిస్ అవుతాము. ఇక్కడ నువ్వు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపావు. వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి బాధ లేకుండా వెళ్ళిపోయావు. ఈ విషయంలో నాకు సంతోషంగా ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్న` అంటూ ర‌కుల్ త‌న ఇన్‌స్టా పోస్ట్ లో పేర్కొంది.

అలాగే బ్లాస‌మ్ తో దిగిన కొన్ని ఫోటోలను రకుల్ పంచుకుంది. దీంతో ఈమె పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక బ్లాసమ్ మృతి పై రకుల్ అభిమానుల సైతం ఎంతగానో ఫీలవుతున్నారు. కాగా, ర‌కుల్ కెరీర్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న `ఇండియన్ 2` లో భాగమైంది.

https://www.instagram.com/p/CmqtTihv9R8/?utm_source=ig_web_copy_link