ఫ్యాషన్ డిజైనర్ తో పెళ్లి.. సీక్రెట్ గా నిశ్చితార్థం.. ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన ప్ర‌దీప్!

టాలీవుడ్ టాప్ మెయిల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి పీటలెక్క‌బోతున్నాడంటూ గ‌త పది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ పెళ్లి వార్తలు వైరల్ కావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు అతడి పెళ్లి పై రకరకాల ప్రచారాలు జరిగాయి.

అయితే ఈసారి మాత్రం ఏకంగా ప్ర‌ముఖ కాస్ట్యూమ్ డిజైనర్ న‌వ్య మారోతును ప్ర‌దీప్ వివాహం చేసుకోబోతున్నాడని గ‌ట్టిగా టాక్ న‌డిచింది. వీరిద్ద‌రికీ సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయింద‌ని.. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎట్టకేల‌కు ప్ర‌దీప్ ఈ వార్త‌ల‌పై నోరు విప్పాడు. న‌వ్య‌తో త‌న పెళ్లి అంటూ వార్త‌ల‌ను ఆయ‌న కొట్టిప‌డేశాడు.

సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని.. అసలు ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేద‌ని.. ఇప్పటివరకు తనను కలవలేద‌ని ప్ర‌దీప్ వివరణ ఇచ్చాడు. అలాగే ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేద‌ని కూడా ప్ర‌దీప్ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, త్వ‌ర‌లోనే త‌న రెండో సినిమా గురించి అప్డేట్ రాబోతుంద‌ని ప్ర‌దీప్ వెల్ల‌డించారు.