తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ స్థానం చాలా ప్రత్యేకమైనది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా హీరోగా అడుగిడినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోగలిగాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా పరిచయమైన పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఇతర స్టార్ హీరోల కన్నా ఎక్కువ పారిపోషకం తీసుకున్న నటుడిగాను అవతరించాడు. ఇక సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన పవన్ కళ్యాణ్ ఆ సంపాదనలో సగం కంటే ఎక్కువ ప్రజల కోసమే ఖర్చు చేస్తారు అనే విషయం నిర్వివాదాంశం.
జనసేన పార్టీ పెట్టిన తరువాత సినిమాలు మానేస్తానని చెప్పిన అతగాడు కేవలం పార్టీ నడపడం కోసమే సినిమాలు చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ భారీగా రెమ్యునరేషన్ సంపాదించినప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఒక పైసా కూడా లేదని నాగబాబు కామెంట్ చేయడం గమనార్హం. ఎందుకంటే తన సంపాదన ప్రస్తుతం పార్టీకి, ప్రజలకు ఇవ్వడానికే సరిపోవడం లేదని చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేసేకంటే ఓ నాలుగైదు చేస్తే బావుంటుంది కదా అని నాగబాబు సలహా ఇచ్చాడట. దానికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… అలా చేస్తే క్వాలిటీ సినిమాలు రావని చెప్పాడట. క్వాలిటీ లేని సినిమాలు 100 చేసినా ప్రయోజనం ఉండదని నాగబాబుతో అన్నాడట. అందుకే సినిమాలు లిమిటెడ్ గా చేస్తున్నాడు అని నాగబాబు వెల్లడించారు. కాగా ఈ మాటలు విన్న మెగాభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 4 ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు.