ఏపీలో బీఆర్ఎస్..వైసీపీ ప్లాన్ అదే..!

బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు..తెలంగాణకే పరిమితమైన పార్టీని పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా విస్తరించాలని చూస్తున్నారు. అటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరిస్తారు. అయితే మొదట ఏపీపై ఫోకస్ చేశారు..అక్కడ పార్టీ ఆఫీసు పెట్టడానికి స్థలాన్ని కూడా చూస్తున్నారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెడితే..దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. అలాగే జగన్..కేసీఆర్‌కు ఎంతవరకు సహకరిస్తారనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎలాగో జగన్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అలా అని ఏపీలో పార్టీ పెడితే జగన్ సహకరించడం జరిగే పని కాదు. అదే విషయాన్ని తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ వచ్చి..జగన్‌ని మద్ధతు అడిగితే..పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, కానీ ఏపీలో మాత్రం ఎవరితో పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. అంటే ఏపీ మినహా..మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీకి జగన్ సహకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే తెలంగాణలో కొద్దో గొప్పో వైసీపీ అభిమానులు ఉన్నారు.

అక్కడ ఎలాగో పార్టీ లేదు కాబట్టి..బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయమని కోరే ఛాన్స్ ఉంది. కాకపోతే కేంద్ర స్థాయిలో జగన్..కేసీఆర్‌కు మద్ధతు ఇవ్వడం జరిగే పని కాదు. ఎందుకంటే జగన్ ..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. మోదీ ప్రభుత్వానికి అన్నీ విధాలా సహకరిస్తున్నారు. అలాంటప్పుడు బీజేపీని కాదని, కేసీఆర్‌కు మద్ధతు ఇవ్వడం జరిగే పని కాదు.

అయితే ఈ విషయంలో కేసీఆర్ ఎలా ముందుకెళ్తారనేది మెయిన్ కాన్సెప్ట్..ఏపీలో జగన్ సపోర్ట్ లేకుండా అక్కడ రాణించడం జరిగే పని కాదు. అయినా ఇపుడున్న పరిస్తితుల్లో ఏపీలో బీఆర్ఎస్ బలపడటం జరిగే పని కాదు. అసలు అక్కడ రాజకీయంగా స్పేస్ లేదు. టీడీపీ, వైసీపీ, జనసేనలతో ఏపీ రాజకీయాలు ఖాళీగా లేవు. పైగా ఉద్యమ సమయంలో ఏపీని కేసీఆర్ టార్గెట్  చేసిన విధానాన్ని ఎవరు మరిచిపోరు. కాబట్టి ఏపీలో బీఆర్ఎస్‌కు పెద్ద స్కోప్ ఉండదు.