నాగబాబు-రోజా మధ్య వివాదం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన రోజా!

నాగబాబు – రోజా… మొన్నటి వరకు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన సెలిబ్రిటీలు. కానీ ఉన్నట్టుండి ఏమయ్యిందో తెలియదు గాని, నాగబాబు జబర్దస్త్ ఆ షోకి దూరమవ్వగా రోజా మాత్రం ఇంకా ఆ షోలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే బుల్లితెర షోలో కూడా అలరిస్తోంది. ఇక ఉన్నట్టుండి వీరు జబర్దస్త్ షో నుండి విడిపోవడంతో నాగబాబుతో ఆమెకు షోలో విభేదాలు వచ్చినట్లు.. ఆ మధ్యలో రకరకాల వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై స్పందించిన రోజా చాలా కీలక విషయాలను వెల్లడించింది. ఇకపోతే 90sలో తెలుగు సినిమాలలో హీరోయిన్ గా అలరించిన రోజా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకురాలుగా, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే రోజా కూడా ఉన్నట్టుండి హఠాత్తుగా జబర్దస్త్ నుంచి తప్పుకోవడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతకుముందు రోజాతో కొన్ని విభేదాలు రావడం వల్ల నాగబాబు షో నుంచి బయటకు వచ్చేశారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి.

అయితే ఇదే విషయం పై రోజా మాట్లాడుతూ.. జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోవడానికి కారణం రోజా కానేకాదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. నాగబాబుగారు నాతో చాలా పాజిటివ్ గా ఉంటారు. గతంలో ఆయన అనేక సందర్భాలలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రొడ్యూసర్స్ కష్టాలు తెలుసుకొని ఇబ్బంది పెట్టని ఒకే ఒక హీరోయిన్ అని నన్ను ఆయన చాలాసార్లు మెచ్చుకున్నారు. ఎందుకంటే వారి ప్రొడక్షన్ లో నేను ముగ్గురు మొనగాళ్లు సినిమా చేశాను. ఆయనేంటో నాకు తెలుసు. నేనేమిటో అతనికి తెలుసు అని రోజా పేర్కొంది.