ఎట్టకేలకు సీక్రెట్ పెళ్లి ఎందుకు జ‌రిగిందో చెప్పిన హీరోయిన్‌..!

టాలీవుడ్ నటి ధన్య బాలకృష్ణ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ్ దర్శకుడైన బాలాజీ మోహన్ ని రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ మరో టాలీవుడ్ నటి కల్పిక గణేష్ చేసిన ఆరోపణలతో ఆమె సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. అయితే ధన్య బాలకృష్ణ టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె తెలుగులో సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

Actress dhanya balakrishna Shows us how to pose for a perfect  pout-ధన్యబాలకృష్ణ గ్లామరస్ ఇమేజస్ | - Actressdhanya

ఈ క్రమంలోనే కల్పిక గణేష్- ధన్య పెళ్లియి విడాకులు తీసుకున్న ఓ దర్శకుడిని పెళ్లి చేసుకుందంటూ ఎవరు ఊహించని షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. అయితే ధన్య బాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదే విషయాన్ని తెలియజేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేసింది. అప్పుటి నుంచి కల్పిక- ధన్య మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. సోషల్ మీడియా వేదిక ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు.

Balaji Mohan Confirms Second Marriage With Dhanya Balakrishna; Files  Defamation Case Against Kalpika Ganesh! - Filmibeat

దర్శకుడు బాలాజీ మోహన్- ధన్య బాలకృష్ణ తో పెళ్లినిజమేనని నిర్ధారిస్తూ.. మేమిద్దరం పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలియజేశారు. నటి కల్పిక తమ వ్యక్తిగత జీవితంపై తరచూ ఆరోపణలు చేస్తుందని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. తమకు సంవత్సరం క్రితమే వివాహం జరిగిందని.. నా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే దన్యను వివాహం చేసుకున్నట్లు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

Balaji Mohan confirms second marriage with Dhanya Balakrishna | Tamil Movie  News - Times of India

మా వ్యక్తిగత విషయాలపై త‌రుచూ ఆరోపణలు చేస్తూ మా పరువుకు భంగం కలిగించేలా చేస్తుందని ఆరోపించారు. అయితే వీరిద్దరి పెళ్లి గురించి ఎందుకు బయట పెట్టలేదనేది తెలియాల్సి ఉంది. బాలాజీ మోహన్- ధన్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇదివరకే అరుణ అనే అమ్మాయితో వివాహం కూడా అయింది. విడాకులు తర్వాత ధన్యను రెండో వివాహం చేసుకున్నాడు. ధ‌న్య బాలకృష్ణ పై కల్పిక చేసిన వ్యాఖ్యలను నిజమేనని తెల్చేశారు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.