మెగాస్టార్ మేలుకో..పాత చింతకాయ పచ్చడి లా ఉంటే ఎలా బాసూ..?

ప్రజెంట్ మెగా – నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలు వీరసింహారెడ్డి ,వాల్తేరు వీరయ్య . చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతి బరిలో టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ . ఈ క్రమంలోనే ఇద్దరు ఫ్యాన్స్ పోటాపోటీగా సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ని వైరల్ చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు ట్రెండ్ అవుతున్నా న్యూస్ ఆధారంగా మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో కంపేర్ చేస్తే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి సినిమాకే ఎక్కువ బజ్ ఏర్పడింది.

దానికి మెయిన్ రీజన్ బాలయ్య తన సినిమాను వీలైనంత విధంగా ప్రమోట్ చేసుకోవడమే . మనకు తెలిసిందే బాలయ్య అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి శుక్రవారం ఆయన సినిమాకు వీలైనంత ఎక్కువగా ప్రమోషన్స్ ఇచ్చుకుంటున్నారు. అదే మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి సినిమా షూట్ లోని ఆగిపోయి ఉన్నారు. ఇక సినిమా షూట్ కంప్లీట్ చేసేది ఎప్పుడు ..ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది ఎప్పుడు ..అంటూ కొందరు ఫాన్స్ బాధపడుతున్నారు. అంతేకాదు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్విట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

కేవలం రెండే రెండు సాంగ్స్ పెండింగ్ ఉన్నాయని.. ఈ క్రమంలోని ఆ సాంగ్స్ షూట్ చేయడానికి విదేశాలకు వెళ్తున్నామంటూ క్రేజీ న్యూస్ ని అందించాడు చిరు. దీంతో ఈరోజు చిత్ర యూనిట్ విదేశాలకు బయలుదేరిన పిక్స్ ను సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. గ్లామరస్ బ్యూటీ శృతిహాసన్ కూడా ఇందులో భాగమై ఉండడం ఫాన్స్ కు కొంత కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది . అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా బాలకృష్ణ లాగే ఫాలో అవుతూ తన సినిమాకు వీలైనంత ప్రమోషన్స్ ఇవ్వాలని.. పాత చింతకాయ పచ్చడి లాగా ఇంకా ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవుతుంటే కుదరదని.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటే తన సినిమాకు వీలైనంత ఎక్కువగా బజ్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

Mega 154: Chiranjeevi And Bobby's Upcoming Movie Is Titled 'Waltair Veerayya '…

మరి చూడాలి ఈ సంక్రాంతికి అసలు విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనేది. బాలకృష్ణ నా..? లేక చిరంజీవినా ..? వీళ్ళతోపాటు తమిళ్ హీరో విజయ్ దళపతి కూడా వారసుడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దీంతో ఈ ముగ్గురిలో ఏ సినిమా హిట్ అవుతుంది.. ఏ హీరో రియల్ హీరోగా సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది..!!

Share post:

Latest