బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం మాతృ ప్రేమను బాగా ఆస్వాదిస్తోంది. ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా అమ్మగా కూడా ప్రమోట్ అయింది. రణబీర్ కపూర్ తో వివాహ చేసుకున్న తర్వాత ఏడాదికి ఒక బిడ్డకి కుటుంబ సభ్యులతో సహా , అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఆలియా భట్ తల్లి అయిన తరువాత ఆమె శరీరంలో పలు మార్పులు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తల్లిగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను దీంతో తన వ్యక్తిగత జీవితంలో భారీగానే మార్పులు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియాలో తెలియజేసినట్లుగా సమాచారం.
గతంలో కంటే మరింత స్వేచ్ఛగా ఆలోచిస్తున్న అలా ఎందుకు జరుగుతోందో తనకి అర్థం కావడం లేదు అంటూ రాసుకుంది. తనకు వచ్చిన ఈ రకమైన మార్పులు తన జీవితం పై నటన పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అంచనా వేయలేకపోతున్నానని తెలియజేస్తోంది. పాత్రల ఎంపిక విషయంలో కూడా పలు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడే చెప్పలేనని తెలియజేస్తోంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని తెలియజేస్తోంది. ఆలియా భట్ చేసిన ఈ వ్యాఖ్యలకు అభిమానులు నటనపై ఆసక్తి తగ్గి రిటైర్మెంట్ తీసుకోబోతోంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కుటుంబాన్ని చూసుకోవడంలో బిజీగా అయినా ఆలియా భట్ అంతకుమించి సాధించేదేముంది అనే రకంగా ఆలియా భట్ ఆలోచిస్తుంది అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఏ క్షణమైన సినిమాల నుంచి ఆలియా భట్ గుడ్ బై చెప్పబోతోంది అంటూ బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఆలియా భట్ అభిమానులు కాస్త నిరుత్సాహపడుతున్నట్లు తెలుస్తోంది. మరి అసలు విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.