చిరు- బాలయ్య స్పీడ్ పెంచ‌క‌పోతే దెబ్బ త‌ప్ప‌దా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ వారి సినిమాల రిజ‌ల్ట్స్‌ కి అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుపడితే అది ఓ చిన్న సైజు మినీ యుద్ధంలా ఉంటుంది. అలాంటి ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని మెగా, నందమూరి అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద 15 సార్లు తలపడ్డారు. చివరిసారిగా 2017లో ఈ ఇద్దరి హీరోలు వారి కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలతో తలపడ్డారు.

Sankranti Films: Chiranjeevi Vs.Balayya Round 3

 

ఆ పొరులో ఇద్దరు విజయం సాధించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాలు తర్వాత ఈ సీనియర్ హీరోలు 2023 సంక్రాంతికి తలపడడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో.. బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయని తెలిసినప్పటి నుంచి సినీ అభిమానులలో ఎవరు విజయం సాధిస్తారనే డిస్కషన్ మొదలైంది.
ఆ విషయం కాసేపు పక్కన పెడితే.. మాస్ గెటప్ లో చిరంజీవి, తనకు కలిసి వచ్చిన ఫ్యాక్షన్ గెటప్ లో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 

అభిమానుల అంచనాలకు తగ్గట్టే మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు సినిమాలను భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుండి మొదటి పాట విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాలకి ఈ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా సినిమాల ప్రమోషన్స్ లో స్పీడ్ కనిపించడం లేదు. మొదటి పాట వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఈ సినిమాల కొత్త పోస్టర్‌ కొత్త అప్డేట్ బయటకు ఇవ్వలేదు. మరోవైపు ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న మరో సినిమా వారసుడు.

Box Office - USA business details of Sankranthi releases

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన వారానికే సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చేశారు. రోజుకో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో నిర్మాత దిల్ రాజు పై చేయి సాధించాడు. చిరు, బాలయ్య సినిమాల ప్రమోషన్‌లో మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తమ జోరు చూపించటం లేదు. ఈ సీనియర్ హీరోల అభిమానులు యాక్టివ్ అవ్వాలంటే వారికి ఈ సినిమాల ప్రమోషన్స్‌తో జోష్ ఇవ్వాలి.. అభిమానులకు ఆ జోష్ మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు ఇస్తుందో.. విడుదల తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో తెలియాల్సి ఉంది.